రాయదుర్గం: నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ టెల్ సంస్థ రోడ్డు మార్జిన్ వెంబడి తవ్వకాలు, ప్రమాదకరంగా మారిన రోడ్డు
రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామ పరిధిలో ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మార్జిన్ వెంబడి భూగర్భ కేబుల్ వేయడం కోసం తవ్వకాలు చేపట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుమతులు లేకుండా రోడ్డు పక్కన లోతైన గోతులు తవ్వి, తీసిన మట్టిని రోడ్డుపైనే పడేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి వేళల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు తప్పడం లేదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు చీకట్లో గోతులు గమనించక ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.