కొండపి: సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి లో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామంలో మంగళవారం పేకాట ఆడుతున్న 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.65,500 ఆగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు అధికారులు చెప్పారు.