కొండపి: సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం పూర్ణహారతి కార్యక్రమం నిర్వహణ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గత పది రోజులుగా ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు, వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. నేటితో ఈ వేడుకలు ముగియనుండటంతో సాయంత్రం ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా 'పూర్ణాహుతి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విశేష పూజను భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.