యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
వెలుగొండ ప్రాజెక్టు క్రింద ముంపు గ్రామాలు 11 ఉన్నాయి. పెద్దారవీడు మండలం సుంకేసుల కలనూతల గుండంచర్ల గ్రామాల నిర్వాసితులు ప్రాజెక్టు కోసం పొలాలు ఇండ్లు సర్వస్వం త్యాగం చేశారు. వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువే అయితే స్థానికంగా నివాసముండే నిజమైన నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులను గుర్తించడంలో అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా రాజకీయంగా అంగబలం కలిగిన కొందరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.