యర్రగొండపాలెం: తమిళనాడులో సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎర్రగొండపాలెం లో బహుజన సంఘాలు సంబరాలు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కావడం పై హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. పాలనలో విజయ్ తన మార్కు చూపిస్తాడని బహుజన నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.