యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ వైసీపీ కార్యకర్తలతో ముట్టడించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ కార్యకర్తలతో ముట్టడించారు. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనను తంతానని తరిమేస్తానని ఎన్నో రకాలుగా టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో పెడితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్విట్టర్లో టిడిపికి వ్యతిరేకంగా పెట్టినందుకు తనపై కేసు నమోదు చేసి నోటీసులు అందజేశారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.ఇప్పుడు 10 కేసులో నమోదు చేశారని 100 కేసుల నమోదు చేసిన భయపడేది లేదు అన్నారు.