కొండపి: ఇవ్వాళ ఒక్కరోజే రాష్ట్రంలో 69 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందన్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో మరో 69 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి సింగరాయకొండ మండలంలో అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ కి ఒక్కొక్క అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సూపర్ సిక్స్ పథకాలలో పెట్టిందని ఇప్పటికే 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని మరొక 69 అన్న క్యాంటీన్లు నేడు ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఈ క్యాంటీన్లు పెట్టడం జరిగిందన్నారు