గిద్దలూరు: కంభం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి ఎల్ఈడీ లైట్లు తొలగించిన పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి సీఐ మల్లికార్జున వాహన తనిఖీలు చేపట్టారు. ఇటీవల మార్కాపురం మండలం రాయవరం వద్ద టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 14 మంది మృతి చెందగా మరో 28 మందికి గాయాలయ్యాయి. ఎస్పీ ఆదేశాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులును సిఐ మల్లికార్జున తనిఖీలు చేపట్టారు. ఎస్సై శివకృష్ణారెడ్డి వాహనానికి అనాధికారకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు తొలగించి వాటిని ధ్వంసం చేశారు. ఇబ్బందులలో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.