మార్కాపురం: కొనకనమిట్ల మండలం ఎదుర్రాళ్లపాడులోని శివాలయంలో చోరీకి యత్నించిన దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురురాళ్లపాడు గ్రామంలోని శివాలయంలో చోరీకి యత్నించిన ఓ దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బుధవారం తెల్లవారుజామున ఆలయం గేటు తాళాలు పగలగొట్టి హుండీ పగలగొడుతుండగా గ్రామస్తులు గమనించి అటువైపు వెళ్ళగా ఇద్దరు దొంగలు పరారు కాగా ఒక దొంగ గ్రామస్తులకు దొరికాడు. దేహశుద్ధి చేసి గ్రామస్తులు దొంగని పోలీసులకు అప్పగించారు.