రాయదుర్గం: టిడిపి నేత సుబహాన్ పై బోర్ వెల్ నాగిరెడ్డి హత్యాయత్నం
టిడిపి నేత, బిటి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్, బుడిమేపల్లి సుభాన్(48) పై ఇటీవలే బిజెపి గూటికి చేరిన ఒకప్పటి వైసిపి నేత బోర్ వెల్ నాగిరెడ్డి అతని అనుచరులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు, బోరువెల్ నాగిరెడ్డి YCP హయాంలో బోర్వెల్ వాహనాల యజమానుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినా పెత్తనం అతనే నడుపుతున్నాడు. దీంతో బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన రిగ్ ఓనర్, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు సుభాన్ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వారిద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో దాడి జరిగింది. నాగిరెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.