దర్శి: వెంకటాచలం పల్లి కొండపై అగ్ని ప్రమాదంతో భయాందోళనలకు గురైన స్థానికులు
Darsi, Prakasam | May 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం వద్ద గల వెంకటాచలం పల్లి కొండపై శుక్రవారం సాయంత్రం ఒక్క సారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన గురయ్యారు. కొండపై నిప్పు రవ్వ రాజు పోవడంతో పొడిగడ్డి పొదలకు మంటలు వ్యాపించాయి. స్థానికుల అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.