యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో నిర్మాణంలో ఉన్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి సొరంగం మార్గాన్ని పరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు 20 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు త్వరగా పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.