కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న లక్ష్మీ నరసమ్మ గుండెపోటుతో మృతి
కళ్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న లక్ష్మీ నరసమ్మ శుక్రవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందినట్లు రెవెన్యూ కార్యాలయ వర్గాలు తెలిపాయి. లక్ష్మీ నరసమ్మ కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.