గిద్దలూరు: బేస్తవారిపేట మండలం ఓంకారపురం గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం ఓంకారపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై నడిచే వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతుడు తీవ్రంగా గాయపడటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై దర్యాప్తు చేశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.