కనిగిరి: అక్రమ పట్టాలను రద్దు చేసి, భూమి లేని పేదలకు భూ పంపిణీ చేయాలని కనిగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యకాస ఆధ్వర్యంలో ధర్నా
కనిగిరి పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో 54 మంది అక్రమంగా బినామీ పేర్లతో 214 ఎకరాలకు పట్టాలను పొందారున్నారు. అక్రమంగా పొందిన పట్టాలను రద్దుచేసి, భూమిలేని నిరుపేదలకు ఆ భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.