కనిగిరి: పామూరు మండలంలో తల్లికి వందనం పథకం అర్హత కోల్పోయిన రైతులకు ప్రభుత్వం మరో అవకాశం: తహసిల్దార్ వాసుదేవరావు
పామూరు మండలంలో రి సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ భూములుగా సర్వే జరిగిన రైతులు భూ విస్తీర్ణం ఎక్కువగా చూపడంతో తల్లికి వందనం పథకం పొందేందుకు అనర్హులుగా మారారని పామూరు తహసిల్దార్ వాసుదేవరావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జాయింట్ భూములను సింగిల్ భూములుగా మార్పు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. మండలంలోని రీ సర్వే జరిగిన గ్రామాలైన అనుమల కొండ, బలిజ పాలెం, చిలకపాడు, వగ్గం పల్లి, దాదిరెడ్డిపల్లి మోట్రావులపాడు, కంబాలదిన్నె గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లలు మళ్లీ తల్లికి వందనం పథకం కు అర్హత సాధించేలా చూసుకోవాలన్నారు.