కనిగిరి: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో కనిగిరి డివిజన్ పరిధిలోని మహిళా సర్పంచులకు ఈనెల 23 నుండి శిక్షణ: ఎంపీడీవో ప్రభాకర్ శర్మ
కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 23 నుండి జూలై రెండవ తేదీ వరకు కనిగిరి డివిజన్ పరిధిలోని మహిళా సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కనిగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర్ శర్మ తెలిపారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డివిజన్ పరిధిలోని మహిళా సర్పంచులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని ఆయన సూచించారు.