కనిగిరి: పట్టణంలో రూ. 1.10 కోట్లతో శరవేగంగా సాగుతున్న రైతు బజార్ నిర్మాణ పనులు, రైతులకు వినియోగదారులకు లబ్ధి చేకూరేలా ప్రణాళిక
కనిగిరి పట్టణంలోని తీగల గొందిలో రూ.1.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రైతు బజార్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ తొలి దశకు చేరుకున్నాయి. దళారుల బెడద తగ్గించి, రైతులు పండించిన పంటలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం రైతు బజార్ నిర్మిస్తుంది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకోగా, పెయింటింగ్ పనులు సాగుతున్నాయి. అన్ని వసతులతో నిర్మించిన ఈ రైతు బజార్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. రైతు బజార్ ప్రారంభమైతే ఇటు రైతులకు, అటు వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.