గిద్దలూరు: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన అరటి తోట, డ్రిప్ పైపులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటకు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో అరటి తోట తో పాటు అరటి తోటలో ఉన్న డ్రిప్పు పైపులు కాలిపోయాయి. దాదాపు లక్ష రూపాయలు వరకు ఆర్థికంగా నష్టపోయినట్లుగా బాధిత రైతు వాపోయాడు. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే ఉన్న మొక్కజొన్న పంట పొలం కూడా కొంతవరకు కాలిపోయినట్లుగా అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.