గిద్దలూరు: గిద్దలూరులో అధికారుల సమక్ష సమావేశం, హాజరైన కలెక్టర్ విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరులో అధికారుల సమీక్ష సమావేశం కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు సమస్యలపై అధికారులు చర్చించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమ ప్రాంతంలో అసైన్మెంట్ భూములను కాజేస్తున్నారని వెంటనే వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలా ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భూములను ఆక్రమించుకున్నట్లయితే వాటిని రద్దుచేసి అర్హులైన వారికి ఇవ్వాలన్నారు.