కొండపి: కొండపిలోని దశ రెడ్డిపాలెం లో పోలీసులు కార్డెన్ సర్చ్, 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపిలోని దశరెడ్డిపాలెం గ్రామంలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా వారి వివరాలు సేకరించామని గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.