మార్కాపురం: జిల్లా ఇన్చార్జి డిఆర్ఓగా వెంకట శివరామిరెడ్డి బాధ్యతలు స్వీకరణ
మార్కాపురం జిల్లా ఇన్చార్జి డిఆర్ఓ గా వెంకట శివరామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో బాధ్యతలు చేపట్టిన ఆయనకు రెవెన్యూ అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఆయన కంభం వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా, కనిగిరి ఇన్చార్జి ఆర్డీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ మోహన్ రాజు ఏవో రవీంద్రరెడ్డి ఎమ్మార్వో చిరంజీవి పాల్గొన్నారు.