రాయదుర్గం: మాల్యం, బిఎన్ హళ్లి గ్రామాలలో రెవెన్యూ అధికారుల గ్రామ సభలు నిర్వాహణ
రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కణేకల్లు, రాయదుర్గం మండల తహసీల్దార్లు బ్రహ్మయ్య, హరికుమార్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఒక నెల ఒక గ్రామం నాలుగు సార్లు పర్యటన' కార్యక్రమంలో బాగంగా గురువారం కణేకల్లు మండలంలోని మాల్యం గ్రామం, రాయదుర్గం మండలంలోని బిఎన్ హళ్లి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. భూ సంబందిత సమస్యలపై స్థానిక రైతుల నుంచి వినతులను స్వీకరించారు. గ్రామస్తులు సమర్పించిన అర్జీలపై విచారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పలువురు మండల స్థాయి అధికారులు విఆర్ఓ లు పాల్గొన్నారు.