మార్కాపురం: జిల్లా కేంద్రంలో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు
మార్కాపురం జిల్లా కేంద్రంలో కోతుల బెడదతో స్థానిక ప్రజలు బెంబలెత్తుతున్నారు. పలు వీధులలో కోతులు సంచరిస్తూ చేతి కందిన వస్తువులను తీసుకెళ్తున్నాయి. స్థానిక జవహర్ నగర్ కాలనీలో దుకాణాలలో ఉన్న చేతి కందిన ప్యాకెట్లను తీసుకువెళ్లి తినేస్తున్నాయని దుకాణదారులు వాపోయారు. ఇండ్లలోకి చొరబడి తినే వస్తువులనే ఎత్తుకెళుతున్నాయి అని అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు