దర్శి: దర్శి పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
Darsi, Prakasam | May 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డు లో వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం భక్తులకు అందజేశారు.