గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలలో కొన్నిటిని ఎమ్మెల్యే తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరి కొన్నిటిని సాధ్యమైనంత త్వరలో అధికారులతో మాట్లాడి పరిశీలిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.