రాయదుర్గం: వేపరాళ్ల, కెంచానపల్లి లో ఘనంగా మొహర్రం, పానకాల ఊరేగింపునకు పోటెత్తిన భక్తులు
రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల? కెంచానపల్లి తదితర గ్రామాల్లో భక్తిశ్రద్దలతో మెహర్రం నిర్వహించారు. శనివారం సాయంత్రం వందలాది మంది భక్తులు ఊరేగింపుగా వచ్చి పానకాలు సమర్పించారు. చక్కెర ఛదివింపులు చేసి మొక్కుబడి చెల్లించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారలను దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు పీర్ల చావిడిల వద్ద బందోబస్తు కల్పించారు.