రాయదుర్గం: కొంతానపల్లి వద్ద పైప్ లైన్ లీకేజ్, పట్టణంలో నీటి సరఫరాలో అంతరాయం
రాయదుర్గం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ కనేకల్ రోడ్డు కొంతానపల్లి సమీపంలో పగిలి పోయి తాగునీరు వృధాగా పోతోంది. మంగళవారం మున్సిపల్ అధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. వెంటనే తాగునీరు సరఫరా నిలిపివేసి పైప్ లైన్ రిపేరి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. లీకేజి అరికట్టే పనులు జరుగుతున్నందున పట్టణంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని ప్రజలు సహకరించాలని కమీషనర్ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.