మార్కాపురం: జిల్లా కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో భారతీయ జనతా పార్టీ 47 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. పార్టీలో కార్యకర్తగా పనిచేయడం గౌరవంగా ఉంది అన్నారు. ప్రధాని సిద్ధాంతాలను పాటించి పార్టీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు