దర్శి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్శి లో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, ఎంపీడీవో కార్యాలయం, పల్లెవనం పార్కులో యోగాసనాల కార్యక్రమం ప్రారంభించినట్లు కమిషనర్ అర్జునరావు తెలిపారు. యోగాను నిత్యజీవితంలో ఒక భాగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.