దర్శి: ముండ్లమూరు మండలం చింతలపూడి గ్రామంలో చిలకలేరు వాగులో పడి పశువుల కాపరి శ్రీనివాసరావు మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Darsi, Prakasam | Jun 10, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు చిలకలూరు వాగులో పడి మృతి చెందాడు. పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్న శ్రీనివాసరావు మేకలను మేత కోసం తీసుకు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు