రాయదుర్గం: అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడకుండా జాగ్రత్త పడాలని టిడిపి బిఎల్ఎ లతో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడకుండా జాగ్రత్త పడాలని టిడిపి బిఎల్ఎ లకు ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు సూచించారు. బుధవారం రాయదుర్గంలో నియోజకవర్గంలోని పార్టీ యూనిట్ ఇన్చార్జ్ లు, బిఎల్ఎ లతో SIR ఓటరు సవరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈనెల 15 తర్వాత బిఎల్ఓ లు ఇంటింటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫారం స్వీకరిస్తారని ఈ లోపు అన్ని కుటుంబాలు మ్యాపింగ్ లో ఉండేలా చూడాలని వివరించారు. మండల కన్వీనర్ లు పాల్గొన్నారు.