రాయదుర్గం: డి. కొండాపురం గొల్లలదొడ్డి గ్రామంలో విషాదకర సంఘటన
రాయదుర్గం మండలం డి.కొండాపురం గొల్లలదొడ్డిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్ కుమార్ పొలంలో తన కుమారుడు బన్నీ(3) మారాం చేస్తుండగా ట్రాక్టర్ పై కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బన్నీ జారికిందపడ్డాడు. ఆసుపత్రి కి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.