మార్కాపురం: జిల్లా కేంద్రంలో బంగారం అమ్మవారి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో వెలసిన బంగారమ్మ అమ్మవారి దేవస్థానంలో విగ్రహ శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జూలై 4వ తేదీ నుండి విగ్రహాలకు చండీ హోమము చండీ పారాయణము నవగ్రహ హోమాలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు మూలమంత్ర అనుష్టనములు తదితర పూజలు నిర్వహించారు. ఇవాళ గర్త పూజ ప్రతిష్ట హోమాలు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అనంతరం శిఖర కలశ కుంబాభిషేకం పూర్ణాహుతి జరిపారు.