మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును జిల్లాకు పంపించడం జరిగిందన్నారు. అందులో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి సాంకేతిక అంశాలపై శిక్షణా ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుటకు ఐదు రోజులపాటు 500 మంది శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.