మార్కాపురం: జిల్లా కేంద్రంలో రోడ్డుకు అడ్డంగా పడిన కొమ్మలను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా కేంద్రంలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసినదే. దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. పట్టణంలోని మెప్మా కార్యాలయంలో భారీ చెట్ల కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిన కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరారు.