రాయదుర్గం: గుమ్మగట్ట మీదుగా ము గ్రామానికి కొత్తగా ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభం
రాయదుర్గం - ములకలేడు RTC కొత్త బస్సు సర్వీసు బుధవారం ప్రారంభించారు. గుమ్మగట్ట ప్రజలు ఇటీవల RTC జోనల్ చైర్మన్ పూలనాగరాజు ను కలసి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో బస్సు సర్వీసు ప్రారంభించినట్లు DM శ్రీనివాసులు తెలిపారు. స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ బస్సు కు హారతిపట్టి కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలికారు. రాయదుర్గంలో ఉదయం 6.45 కి బయలుదేరి గుమ్మగట్టకు 7.15 కు, ములకలేడుకు 9 గంటలకు చేరుతుంది.