కమలాపూర్: కమలాపూర్ లో 12 అడుగుల భారీ కొండచిలువ పట్టివేత
హన్మకొండ జిల్లా కమలాపూర్ లోని బీసీ కాలనీలో 12 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, జూపార్క్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని జూపార్క్‌కు తరలించినట్లు బీట్ అధికారి పొన్నం అశోక్ తెలిపారు.