విశాఖపట్నం: విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్లో కొత్తగా చైల్డ్ కేర్ యూనిట్ ప్రారంభం
విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్లో చిన్నారుల భద్రత కోసం చైల్డ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారం 22 వద్ద అందుబాటులో ఉండే ఈ సదుపాయం ద్వారా తప్పిపోయిన పిల్లలకు రక్షణ కల్పిస్తారు. పిల్లల భద్రత కోసం 1098 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.