రాయదుర్గం: 6 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసిన బొమ్మనహాల్ పోలీసులు
బొమ్మనహాల్ మండలం, ఉంతకల్లు క్రాస్ వద్ద మట్కా నిర్వాహణపై పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 6 మంది మట్కా నిర్వాహకులను పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి నుండి రూ1.40 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బొమ్మనహాల్ మండలంలో ఎవరైనా మట్కా నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.