తాడిపత్రి: భీముని పల్లిలో విషాదం, అప్పులు బాధ తాళలేక చిన్నారెడ్డి అనే యువరైతు ఉరి వేసుకుని ఆత్మహత్య
పెద్దవడుగూరు మండలం భీమునిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు చిన్నారెడ్డి (30) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు భీముని పల్లి గ్రామానికి వెళ్లారు. చిన్నారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.