గిద్దలూరు: రాజశేఖర్ రెడ్డిని చంపింది చంద్రబాబే అని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్ అబండాలు వేస్తున్నారని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బ్రిటన్ స్ట్రీట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అశోక రెడ్డి శంకుస్థాపన చేశారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూ.7 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సాధ్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.