మార్కాపురం: జిల్లా కేంద్రంలో వెలిసిన మార్కండేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేకం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు వరుణ్ తేజ్ శర్మ, ఆంజనేయ శర్మ స్వామివారికి అన్నాభిషేకం చేశారు. ఉభయ దాతలు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లికార్జున శర్మ ధర్మకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.