గిద్దలూరు: కంభం మండలం రావిపాడు గ్రామంలో మధ్యమధ్యలో దూషిస్తున్నాడని వ్యక్తిపై దాడి, ఆస్పత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో గోపాల్ అనే వ్యక్తిపై గ్రామస్తులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోపాలనీ కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అతని మార్కాపురం తరలించారు. మద్యం మత్తులో గోపాల్ గ్రామస్తులను దూషిస్తున్నాడని గ్రామస్తులు కక్షపెట్టుకొని తన భర్త పై దాడికి పాల్పడ్డారని అతనికి ఏమైనా అయితే తమ కుటుంబ పరిస్థితి ఏమిటి అని గోపాల్ భార్య తీవ్ర వేదన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరింది.