యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మంత్రి పదవి పొందారన్నారు రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిందన్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా రికార్డును పొందారన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కూడా పనిచేసినట్లు పేర్కొన్నారు