మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత
ఎయిడ్స్ రహిత మార్కాపురం జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం పురస్కరించుకొని కలెక్టర్ విజయ సునీత అవగాహన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి కోర్టు సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి అంటూ వ్యాధి కాదని అంటించే వ్యాధి అనే ప్రజలు గుర్తించాలన్నారు. హెచ్ఐవి ని ప్రారంభ దిశలోని గుర్తిస్తే మరణాల సంఖ్య ప్రారంభ దిశలోనే గుర్తించవచ్చని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.