రాయదుర్గం: చతుర్ముఖ పశుపతినాథుని ఆలయంలో గుప్తనిధుల వేట కలకలం
రాయదుర్గం మండలంలోని చదం గొల్లలదొడ్డి సమీపంలోని లింగాలబండపై ఉన్న పురాతన చతుర్ముఖ పశుపతినాథుని ఆలయంలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గతంలోనే దుండగులు మూలవిరాట్టుకు ఎదురుగా ఉన్న నంది విగ్రహం తలను పగలగొట్టారు. ఆ తర్వాత మరోసారి మూల విరాట్టుకు ఒక వైపు ముక్కలు చేశారు. తాజాగా ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజలు చేసి, ధ్వజస్తంభం కట్ట రాళ్లను పెకలించారు. సోమవారం పూజల కోసం వెళ్లన భక్తులు ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చూసి ఆందోళనకు గురయ్యారు. గుప్త నిధుల కోసమే ఈ విధంగా ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.