కొండపి: సింగరాయకొండ మండలం పాకలలో మత్స్యకారులకు వేట నిషేధకాల భృతి పంపిణీ చేసిన మంత్రి స్వామి
సింగరాయకొండ మండలం పాకలలో మత్స్యకారులకు వేట నిషేధకాల భృతి పంపిణీ ని సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పాల్గొని నగదు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేట నిషేధకాల భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిందని అన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీదే అని మంత్రి తెలిపారు.