కొండపి: బయట వ్యక్తులకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు: కొండపి పొగాకు వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్
కొండేపి పొగాకు వేలం కేంద్రానికి పొగాకు బేళ్లు తీసుకువచ్చే రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేలం కేంద్రానికి తీసుకువచ్చే పొగాకు బేళ్లలో అన్యపదార్థాలు లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా బయట వ్యక్తులకు పొగాకును అమ్మరాదని అలా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.