కొండపి: సింగరాయకొండలోని బస్టాండ్, రద్దీ ప్రాంతాలలో పోలీసు బృందాల తనిఖీలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం రద్దీ ఏరియాలలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.సోమవారం పోలీస్ బృందాలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని రద్దీ ఏరియాలలో, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ సెంటర్ లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.